SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి

SBI Credit Card Limit: మీతో అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే క్రిడెట్ కార్డ్ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ సరిపోవడం లేదని భావిస్తుంటారు. మీరు మీ ఎస్‌బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని పెంచుకోవాలంటే.. అందుకు 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

Last Updated : Jan 3, 2021, 05:07 PM IST
SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి

SBI Credit Card Limit:  మీతో అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే క్రిడెట్ కార్డ్ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ సరిపోవడం లేదని భావిస్తుంటారు. మీరు మీ ఎస్‌బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని పెంచుకోవాలంటే.. అందుకు 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

ఎస్‌బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ పరిమితి మీరు మీ క్రెడిట్ కార్డుపై ఒక నిర్దిష్ట సమయంలో ఖర్చు చేయగల మొత్తాన్ని సూచిస్తుంది. మీ క్రెడిట్ కార్డుపై మూడు రకాల పరిమితులు ఉన్నాయి- మొత్తం క్రెడిట్ పరిమితి, అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి మరియు నగదు పరిమితి. మొత్తం క్రెడిట్ పరిమితి, అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితులు ఉన్నాయి.

మొత్తం క్రెడిట్ పరిమితి(Total Credit Limit): ఇది మీ క్రెడిట్ కార్డులో మీరు పొందగల గరిష్ట క్రెడిట్ పరిమితి.
అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి(Available Credit Limit): ఇది పలానా తేదీ నాటికి బిల్లులు చెల్లించేందుకు, క్రెడిట్ లిమిట్ వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న నగదు విలువ మొత్తం. మీ క్రెడిట్ పరిమితిని 2 పద్ధతుల ద్వారా పెంచుకోవచ్చు. 

Also Read: Mi 10i Price (Launch Date): 108 మెగా పిక్సెల్ కెమెరా.. పూర్తి ఫీచర్లు ఇవే

 

ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ (Pre-approved Credit Limit Offer)
క్రెడిట్ కార్డ్(Credit Cards) లిమిట్ పెంచుతామని బ్యాంకులే కస్టమర్లకు అవకాశాన్ని అందిస్తాయి. దీనినే ప్రీ అప్రూవ్డ్ క్రిడెట్ లిమిట్ అని అంటారు. మీరు క్రెడిట్ కార్డ్ వాడిన విధానం, మీకు నెలా నెలా వచ్చే ఆదాయాన్ని అనుగుణంగా బ్యాంకులు మీకు క్రెడిట్ లిమిట్ ఆఫర్ చేస్తాయి.

ఒకవేళ మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ ఉంటే మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఈజీగా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఈమెయిల్, మంత్లీ స్టేట్‌మెంట్, ఎస్ఎంఎస్ ద్వారా ఈ ఆఫర్ వివరాలు క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అందుతాయి.

Also Read: ​LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

ఆదాయ పత్రాల ద్వారా క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను పెంచుకోవాలనిపిస్తే సాధ్యపడుతుంది. sbicard.comకు ఈమెయిల్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచాలని కోరవచ్చు. రెండు వర్కింగ్ డేస్‌లో మీకు రిప్లై వస్తుంది. SBI Card helpline number 1860 180 1290, లేక 39020202 (ఎస్టీడీ కోడ్‌ను యాడ్ చేయాలి) నెంబర్లకు కాల్ చేయాలి. 

ఈ కింది ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌ను సబ్మిట్ చేయాలి
Form 16,
ITR VI
చివరి 2 నెలల శాలరీ స్లిప్

Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News